Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Deepika Padukone : బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ కొన్నాళ్ల క్రితం ప్రగ్నెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల కల్కి సినిమాతో మెప్పించిన దీపికా కల్కి ప్రమోషన్స్ లో తన బేబీ బంప్ తోనే పాల్గొంది. ఇటీవలే మూడు రోజుల క్రితం కూడా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి భర్త రణవీర్ సింగ్ తో హాజరైంది. నిన్న దీపికా పదుకోన్ హాస్పిటల్ లో జాయిన్ అయిందని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. తాజా బాలీవుడ్ సమాచారం ప్రకారం దీపికా పదుకోన్ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఇవాళ ఉదయం దీపికా పాపకి జన్మనిచ్చింది. దీపికా – రణవీర్ తల్లితండ్రులయ్యారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రణవీర్ సింగ్ దీపికా పదుకోన్ 2018 నవంబర్లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Admin
Studio18 News