Saturday, 24 January 2026 01:59:05 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Keerthy Suresh: మంచిని స్వీకరిస్తా... చెడును వదిలేస్తానంటున్న అందాలభామ కీర్తి

Date : 16 August 2024 11:13 AM Views : 239

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అందాలతార కీర్తి సురేశ్ గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. 5.7 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న కీర్తి సురేశ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తాజాగా సుమన్ కుమార్ దర్శకత్వంలో ఆమె నటించిన కోలీవుడ్ చిత్రం రఘుతాత గురువారం విడుదలయింది. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ ..ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో అభిమానులు వేసిన పలు ప్రశ్నలకు కీర్తి సురేశ్ ఆసక్తికరంగా జవాబులు ఇచ్చారు. ఓ ప్రశ్నకు కీర్తి సురేశ్ ఇచ్చిన సమాధానం అభిమానులను ఆకట్టుకోవడమే కాక చాలా మందికి స్పూర్తిని ఇచ్చేదిగా ఉందనే టాక్ వినబడుతోంది. ఇంతకూ అదేమిటంటే .. విమర్శలు, ప్రతికూల పరిస్థితులపై ఆమె సమాధానం ఇస్తూ మంచిని మాత్రమే తీసుకుని చెడ్డ విషయాలను ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలని అన్నారు. సహజంగా సినీ ఇండస్ట్రీలో నటీ నటులపై విమర్శలు వస్తూ ఉంటాయి. దీనిపై కీర్తి సురేశ్ స్పోర్టివ్ గా ఇచ్చిన జవాబు అభిమానులను ఆకట్టుకుంది. ఇకపోతే.. తన పేరును వెండితెరపై తొలిసారిగా చూసిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు. టీమ్ చూపిన ప్రేమ తనకు రఘుతాత విషయంలో బాగా నచ్చిందని అన్నారు. నటుడు వరుణ్ ధావన్ ను లవర్ బాయ్ గా అభివర్ణించారు కీర్తి సురేశ్. రఘుతాతలో పెళ్లి సన్నివేశం ఇష్టమైనదిగా పేర్కొన్నారు. తమిళ్ లో రివాల్వర్ రీటా అనే కొత్త సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పారు. బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నానని చెప్పిన కీర్తి .. తన స్నేహితుడు అట్లీ సినిమా తేరీకి అది రీమేక్ అని తెలిపారు. కాలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని చెప్పారు. తనకు ఇష్టమైన సినిమాల్లో రెమో ఒకటని, అలాంటి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నానని అన్నారు. అనుష్క శెట్టి చాలా మంచి వ్యక్తి అని కితాబునిస్తూ తనను స్వీటీ అనే పిలుస్తానని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :