Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rocking Rakesh – Sujatha : జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్ – సుజాత తల్లితండ్రులు కాబోతున్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన రాకింగ్ రాకేష్ ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి టీమ్ లీడర్ గా ఎదిగి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో పాత్రలు చేస్తున్నాడు రాకింగ్ రాకేష్. ఇక టీవీ యాంకర్ గా పనిచేసే సుజాత బిగ్ బాస్ లో పాల్గొని బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక జబర్దస్త్ షోలో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. జబర్దస్త్ లో పరిచయమైన రాకింగ్ రాకేష్ – సుజాత కొన్నాళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట తల్లి తండ్రులు కాబోతున్నారు. ఇటీవల శ్రీమంతం నిర్వహించగా రాకింగ్ రాకేష్, సుజాత పలు బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసారు. అలాగే ఓ వీడియో కూడా చేసి తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసారు. త్వరలోనే డెలివరీ కానుందని సుజాత తెలిపింది. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి.. అమ్మానాన్న అనే పిలుపుకి దగ్గర్లో. గొప్ప తల్లిదండ్రులు అవ్వాలని ఆశీర్వదించండి అంటూ పోస్ట్ చేసారు రాకేష్, సుజాత. దీంతో పలువురు నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తూ, డెలివరీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ – సుజాత బేబీ బంప్ స్పెషల్ ఫోటోషూట్ వైరల్ గా మారింది.
Admin
Studio18 News