Saturday, 24 January 2026 01:47:30 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Karunakaran : పవన్ ‘తొలిప్రేమ’ డైరెక్టర్‌‌కి ఫస్ట్ అవకాశం వచ్చేలా చేసింది ఎవరు? చెన్నై టు హైదరాబాద్‌కి ఫ్లైట్‌లో..

Date : 27 July 2024 10:51 AM Views : 222

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Karunakaran – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఆల్ టైం క్లాసిక్స్ లో నిలిచిపోయింది. ఈ సినిమాని కరుణాకరన్ డైరెక్ట్ చేసాడు. కరుణాకరన్ కి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కరుణాకరన్ ఆ తర్వాత యువకుడు, వాసు, బాలు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్.. ఇలా వరుస హిట్ సినిమాలు చేసాడు. 2018లో చివరిసారిగా కరుణాకరన్ సాయి ధరమ్ తేజ్ తో తేజ్ ఐ లవ్ యు సినిమా తీయగా ఆ సినిమా పరాజయం పాలైంది. అప్పట్నుంచి మళ్ళీ ఈ దర్శకుడు కనిపించలేదు. తాజాగా విజయ్ ఆంటోని తుఫాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడంతో కరుణాకరన్ చాన్నాళ్లకు కనిపించాడని వైరల్ అవుతున్నారు. అయితే తమిళనాడుకు చెందిన కరుణాకరన్ అసలు టాలీవుడ్ కి వచ్చి పవన్ తో ఎలా సినిమా తీసాడు? ఇక్కడికి ఎలా వచ్చాడు తెలుసా? తమిళ్ లో పలు సినిమాలకు రైటర్ గా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన కరుణాకరన్ తాను రాసుకున్న కథ కోసం హీరోని వెతుకుతున్న సమయంలో సూపర్ హిట్ మ్యాగజైన్ పై పవన్ కళ్యాణ్ ఫోటో చూసి చెన్నైలోని సూపర్ హిట్ ఆఫీస్ కి వెళ్లి సూపర్ హిట్ అధినేత దివంగత సీనియర్ పీఆర్వో BA రాజుని కలిశారు. మ్యాగజైన్ పై ఫోటో చూపించి పవన్ కళ్యాణ్ ని నేను కలవాలి, సినిమా కథ చెప్పాలి, ఆయనతో సినిమా తీయాలని చెప్పారంట. BA రాజు కరుణాకరన్ గురించి అన్ని వివరాలు కనుక్కొని చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పి ఆయనే చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ కరుణాకరన్ ని పంపించారట. అలా కరుణాకరన్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి కథ చెప్పి ఓకే చేసుకొని తొలిప్రేమ లాంటి క్లాసిక్ ఫిలిం ఇచ్చాడు. ఇక తమిళ వ్యక్తి అయిన కరుణాకరన్ తొలిప్రేమ హిట్ తో ఇక్కడే టాలీవుడ్ లో సెటిల్ అయిపోయి ఇక్కడే వరుస సినిమాలు చేసాడు. మళ్ళీ కరుణాకరన్ ఎప్పుడు సినిమా తీస్తాడు అని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :