Sunday, 08 March 2026 09:49:17 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

NTR – Devara Shoot : ఎన్టీఆర్ డ్యాన్స్‌కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.. ‘దేవర’ సాంగ్ షూట్‌ నుంచి కెమెరామెన్ ట్వీట్..

Date : 11 August 2024 10:43 AM Views : 317

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : NTR – Devara Shoot : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర సినిమా నుంచి పార్ట్ 1 సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కి దగ్గరికి రావడంతో శరవేగంగా షూటింగ్ పూర్తిచేస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమాలో ఒక సాంగ్ ని రాత్రి పూట షూట్ చేస్తున్నారు. తాజాగా దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దేవర సెట్స్ నుంచి రత్నవేలు తన ఫోటోని నేడు తెల్లవారుజామున షేర్ చేసి.. ఒక అదిరిపోయే పాటను షూట్ చేస్తున్నాము. అనిరుధ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. డ్యాన్స్ లో తారక్ స్టైల్, గ్రేస్ అదిరిపోయింది. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు ఈ పాటకు. గణేష్ ఆచార్య మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు అని ట్వీట్ చేసారు. దీంతో రత్నవేలు ట్వీట్ వైరల్ గా మారింది. సాధారణంగానే ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతారు. ఇప్పటికి దేవర నుంచి వచ్చిన రెండు పాటల్లోనూ ఎన్టీఆర్ డ్యాన్స్ చేసే స్కోప్ ఉండదని అర్ధమయిపోయింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమా నుంచి ఒక మాస్ డ్యాన్స్ సాంగ్ ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఎన్టీఆర్ డ్యాన్స్ ని పొగుడుతూ ట్వీట్ వేయడంతో ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :