Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mahesh Babu – Raayan : తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శల ప్రశంసలు అందుకుంటూ మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబు వీక్షించారు. అద్భుతమైన నటనతో పాటు డైరెక్షన్‌లో ధనుష్ అదరగొట్టాడని అన్నారు. ‘రాయన్’ లో ధనుష్ నటన, దర్శకత్వం అద్భుతం. ఎస్‌జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ లు అదరగొట్టారు. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు వందశాతం కష్టపడ్డారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ ఆర్ రెహమాన్ సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సందీప్ కిషన్ స్పందిస్తూ.. కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక మహేశ్ బాబు విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించనున్నాడు. ఇందుకోసం తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం ఉండనుందని అంటున్నారు. ఇక ఈ సినిమా మూడు పార్టులుగా తీయాలని దర్శక దీరుడు రాజమౌళి అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
Admin
Studio18 News