Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan – Chiru – Charan : నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లతో పాటు అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈసారి పవన్ డిప్యూటీ సీఎం కావడంతో పుట్టిన రోజు హంగామా మరింత ఎక్కువ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి కోసం, చిరు తనయుడు రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియాలో స్పెషల్ గా విషెస్ షేర్ చేసారు. చిరంజీవి పవన్ కళ్యాణ్, సురేఖతో కలిసి దిగిన పాత ఫోటో షేర్ చేసి.. కళ్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ అంటూ స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.
Admin
Studio18 News