Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తనకు చాలా సింపుల్ గా ఉండటమే ఇష్టమని సినీ హీరో విశాల్ చెప్పారు. ఆడంబరంగా బతకడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. ఇతరులను కాపీ కొట్టడం కూడా తనకు నచ్చదని తెలిపారు. గతంలో ఓ ఎన్నికల సమయంలో తాను సైకిల్ పై వెళ్లడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయని... హీరో విజయ్ ను తాను కాపీ కొట్టానని పలువురు విమర్శించారని... తనకు కాపీ కొట్టడం తెలియదని చెప్పారు. పోలింగ్ బూత్ కు తమ ఇల్లు దగ్గర్లోనే ఉండటంతో తాను సైకిల్ పై వెళ్లానని తెలిపారు. విజయ్ ను ఇమిటేట్ చేయడం కోసం అలా చేయలేదని చెప్పారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులకు మాత్రమే కారు ఉందని, తనకు లేదని, కొంతకాలం క్రితం అమ్మేశానని విశాల్ తెలిపారు. చెన్నైలో రోడ్లు దారుణంగా ఉన్నాయని... సైకిల్ పై అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చని చెప్పారు. అన్ని పనులు పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనిపిస్తోందని... త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాసేవ చేస్తానని తెలిపారు. విషయం ఏదైనా సరే తాను నిజయతీగా మాట్లాడతానని... తన మాదిరి అందరూ ఉండలేరని చెప్పారు.
Admin
Studio18 News