Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ మూవీలో ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉందని ఓ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ అన్నాడు. దీనిపై టాలీవుడ్ హీరోలు నాని, శర్వానంద్‌లతో పాటు పలువురు ఘాటుగా స్పందించారు. తాజాగా అర్షద్ వార్సీ కామెంట్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. ‘కల్కి 2’లో ప్రభాస్‌ను ది బెస్ట్‌గా చూపిస్తానని అన్నాడు. ‘కల్కి’ మూవీలోని క్లైమాక్స్‌లో ప్రభాస్.. కర్ణుడిగా ఎంట‍్రీ ఇచ్చే సీన్ ని ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ నెటిజన్.. ఈ ఒక్క సీన్ బాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తంతో సమానం అని రాసుకొచ్చాడు. దీనిపై నాగ్ అశ్విన్ స్పందించాడు. మళ్లీ పాతకాలంలోకి వెళ్లొద్దన్నాడు. నార్త్, సౌత్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా విడదీసి మాట్లాడొద్దన్నారు. అందరం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లమేనని చెప్పుకొచ్చాడు. అర్షద్ కొంచెం హుందాగా మాట్లాడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.అయినప్పటికి అతడి చిన్నారుల కోసం కల్కి బుజ్జి బొమ్మలను పంపిస్తాము. ఇక కల్కి రెండో భాగంలో ప్రభాస్‌ను మరింత బెస్ట్‌గా చూపిస్తాను అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇప్పటికే చాలా ద్వేషంతో నిండిపోయిందని, మనం దాన్ని పెంచే పని చేయొద్దన్నారు. తానే కాదని, ప్రభాస్ కూడా ఇలానే చెబుతారని అశ్విన్ తెలిపాడు.
Admin
Studio18 News