Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Allu Arjun : తాజాగా కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి జరిగిన ప్రమాదంలో అనేకమంది చనిపోయారు. మరింతమంది నిరాశ్రయులు అయ్యారు. ఈ ఘటనలో ఇప్పటికే 300 పైగా మృతులు బయటపడగా ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. అయితే వయనాడ్ బాధితులకు దేశ వ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది సౌత్ సినీ పరిశ్రమల సెలబ్రిటీలు కూడా వయనాడ్ కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ విరాళాలు అందచేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ 25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో.. వయనాడ్ లో జరిగిన ఘటన చాలా బాధ కలిగించింది. కేరళ నాకు చాలా ప్రేమను ఇచ్చింది. నా వంతు సాయం నేను చేయాలనుకుంటున్నాను. అందుకే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల విరాళం ఇస్తున్నాను. మీ అందరి భద్రత కోసం ప్రార్థిస్తాను అని ట్వీట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. అల్లు అర్జున్ కి మలయాళంలో కూడా భారీ మార్కెట్, ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.
Admin
Studio18 News