Sunday, 08 March 2026 09:31:48 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Kalki 2 – Deepika Padukone : దీపికా పదుకోన్ వల్ల కల్కి 2 మరింత ఆలస్యం.. ఎందుకంటే..?

Date : 06 August 2024 11:02 AM Views : 226

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kalki 2 – Deepika Padukone : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ సినిమా ‘కల్కి 2898 ఎడి’. ఈ మూవీలో ప్రభాస్ సహా కమల్, అమితాబ్ లాంటి దిగ్గజాలు నటించడంతో ఇండియన్ సినిమా నుంచి మరో గ్రేట్ సినిమాగా నిలిచింది. 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ హిట్ గా నిలిచింది. పార్ట్ 1లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ 2లో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మాత అశ్వినీదత్ కూడా పార్ట్ 2 షూటింగ్ కొంతభాగం అయింది. 2025లో మిగిలిన షూటింగ్ పూర్తిచేస్తాము అని తెలిపారు. అయితే ఇలాంటి టైంలో సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కల్కి2 వచ్చే ఏడాది జూన్, జులై కల్లా రిలీజ్ అయిపోతుందంటూ ఈ మధ్య ప్రకటించేశారు నిర్మాత అశ్వనీదత్. అదే టైమ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కల్కి-2 కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించబోతున్నానని సినిమా ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేనని క్లియర్ గా చెప్పేశాడు. ఇప్పుడిదంతా ఎందుకుంటే అశ్వనీదత్, నాగ్ అశ్విన్ చెప్పిన గడువు కంటే, కల్కి-2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కల్కి మూవీలో నటించిన దీపికా పదుకోన్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు. సెప్టెంబర్ లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో కల్కి-2 షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలామంది అనుకోవచ్చు. కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చిపడింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కనీసం ఏడాదిపాటు గ్యాప్ తీసుకొని తన బిడ్డకు సమయం కేటాయించాలని భావిస్తోందంట దీపిక పదుకోన్. దీని కోసం ఆమె తనకెంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును కూడా కాదనుకుంది. ఇదే క్రమంలో ఆమె ఓ పాపులర్ బాలీవుడ్ షో సీజన్-3కి కూడా నో చెప్పిందంట. ఇవన్నీ చూస్తుంటే ఆమె కల్కి-2 షూటింగ్ కు కూడా దూరమయ్యేలా ఉంది. సంక్రాంతి తర్వాత కల్కి-2ను సెట్స్ పైకి తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తోంది. కానీ సినిమా కథ మొత్తం దీపిక పాత్ర చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అప్పుడే షూటింగ్ అని తెలుస్తుంది. దీంతో కల్కి 2 అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక కల్కి 2 ఆలస్యం అవుతుండటంతో ఇప్పటికే ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ కి ఓకే చెప్పేసినట్టు సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :