Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Roshan – Champion : ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ వారసుడిగా రోషన్ నిర్మలా కాన్వెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కె.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో ‘పెళ్లిసందD’ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. పెళ్లిసందD సినిమా తరవాత రోషన్ మూడు సినిమాలు ప్రకటించాడు. కానీ ఆ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. తాజాగా రోషన్ నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చింది. కల్కి సినిమాని నిర్మించిన వైజయంతి మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో గత సంవత్సరం రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమాని ప్రకటించారు. తాజాగా నేడు ఈ ఛాంపియన్ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.
Admin
Studio18 News