Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chiranjeevi – Tirumala : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో రెండు రాష్ట్రాల్లోని అయన అభిమానులు సందడి చేస్తున్నారు. పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అందరూ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక చిరంజీవి తన భార్య సురేఖ, మరికొంతమంది సన్నిహితులతో కలిసి తిరుమల వెళ్లారు. నిన్న రాత్రే తిరుమలకు చేరుకోగా నేడు ఉదయం చిరంజీవి వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. చిరంజీవి ఆలయం లోపలికి వెళ్తుండగా తీసిన విజువల్స్ వైరల్ గా మారాయి.
Admin
Studio18 News