Sunday, 08 March 2026 04:24:16 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Sai Durga Tej: సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థికసాయం అందించిన మెగా హీరో సాయి దుర్గా తేజ్

Date : 26 July 2024 05:13 PM Views : 279

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గత కొన్నాళ్లుగా అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చాలావరకు ఆమె దాతల సాయంపైనే బతుకు వెళ్లదీస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు సాయం అందించారు. తాజాగా, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కూడా పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేశారు. సాయి దుర్గా తేజ్ సినీ జర్నలిస్టులకు రూ.5 లక్షల విరాళం ఇవ్వగా, అందులో ఒక లక్ష రూపాయలు పావలా శ్యామలకు కేటాయించారు. తనకు సాయి దుర్గా తేజ్ ఆర్థిక సాయం చేయడం పట్ల పావలా శ్యామల కృతజ్ఞతలు తెలియజేశారు. సాయి తేజ్ తమకు సాయం చేస్తానని చాలాకాలం కిందటే మాటిచ్చాడని, కానీ ఆ తర్వాత ఆయనకు యాక్సిడెంట్ కావడంతో ఆ విషయం మర్చిపోయి ఉంటాడని అనుకున్నామని, కానీ ఇప్పటికీ ఆ విషయం గుర్తుపెట్టుకని సాయం అందించడం ఆయన మంచితనానికి నిదర్శనం అని పావలా శ్యామల కొనియాడారు. ఈ సందర్భంగా సాయి తేజ్ ఆమెతో వీడియో కాల్ మాట్లాడారు. ఓ దశలో తాము బతకలేక చనిపోదాం అనుకున్నామని, కానీ మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ఆదుకున్నారని శ్యామల వెల్లడించారు. మా అమ్మాయికి కూడా కాలు విరిగింది... దాంతో మాకు బతకాలన్న ఆశ పోయింది... చచ్చిపోదాం అనుకున్నాం అని ఆమె వాపోయారు. ఊరుకోండమ్మా... మీరు అలా అనకూడదు... మేమంతా ఉన్నాం కదా అని సాయి తేజ్ ఓదార్పు వచనాలు పలికారు. సాయితేజ్ గారూ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు... మీరు బతకాలని ఆ దేవుడ్ని ప్రార్థించాం... దేవుడి దయవల్ల మీరు క్షేమంగా తిరిగి వచ్చారు అని పావలా శ్యామల సాయి తేజ్ కు తెలిపారు. అందుకు సాయి తేజ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :