Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Tollywood – Samantha : ఇటీవల మలయాళ సినీ పరిశ్రమలో హేమ కమిటీ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ వంటి అంశాలు వెలుగులోకి తీసుకొచ్చింది హేమ కమిటీ. అలాగే పలువురు నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే మలయాళ సినీ పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక చర్చగా మారింది. అయితే హేమ కమిటీ లాగే టాలీవుడ్ లో కూడా ఒక కమిటీ వేయాలని టాలీవుడ్ లోని మహిళా ప్రముఖులు కోరుతున్నారు. టాలీవుడ్ లో మహిళల కోసం వాయిస్ ఆఫ్ ఉమెన్ – TFI అనే సంస్థని గతంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు పలువురు మహిళా సినీ ప్రముఖులు. ఇందులో డైరెక్టర్ నందిని రెడ్డి, అమల, సమంత.. పలువురు స్టార్స్ ఉన్నారు. ఆ సంస్థ నుంచి హేమ కమిటీని ఏర్పాటు చేసిన వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ WCC ని అభినందిస్తూ ఇలాంటి కమిటీ టాలీవుడ్ లో కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కమిటీ ఏర్పాటు చేసి టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న సంఘటనలు బయటపెట్టాలని కోరారు. అప్పుడే మహిళలు భద్రమైన వాతావరణంలో పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందని తెలిపారు. నందిని రెడ్డి చేసిన ఈ పోస్ట్ ని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Admin
Studio18 News