Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Srikanth Kidambi – Shravya Varma : మాజీ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించాడు. టాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత, రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మని శ్రీకాంత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకొని దిగిన ఫోటోని షేర్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. శ్రీకాంత్ బ్యాడ్మింటన్ లో అనేక మెడల్స్ సాధించాడు. గతంలో వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ పొజిషన్ కూడా అందుకున్నాడు. ఇక శ్రావ్య వర్మ రామ్ గోపాల్ వర్మ మేనకోడలిగా టాలీవుడ్ లో ఫ్యాషన్ డిజైనర్ గా పరిచయమైంది. టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలకు పర్సనల్ డిజైనర్ గా కూడా పనిచేస్తుంది. నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్ళు నిశ్చితార్థం చేసుకొని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో పలువురు సినీ, క్రీడా సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Admin
Studio18 News