Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Varun Tej : వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మట్కా’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో 1960 బ్యాక్‌డ్రాప్‌తో గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా మట్కా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. తాజాగా మట్కా సినిమా నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ లుక్ చూస్తుంటే వరుణ్ తేజ్ డాన్ గా, తనకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు అని తెలుస్తుంది. గ్యాంబ్లింగ్ ఏరియాకు హెడ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రతిసారి వరుణ్ తేజ్ కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. గత కొన్నాళ్లుగా విజయాలు లేని వరుణ్ కి ఈ ప్రయోగం అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
Admin
Studio18 News