Sunday, 25 January 2026 05:43:29 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Raksha Bandhan : సిస్టర్ సెంటిమెంట్‌తో టాలీవుడ్‌లో వ‌చ్చిన సినిమాలు ఇవే..

Date : 19 August 2024 11:16 AM Views : 182

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Raksha Bandhan 2024 : సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండగగా రక్షా బంధన్ జరుపుకుంటారు. తోడ‌బుట్టిన వాళ్ల‌ని క‌లుసుకుని రాఖీ క‌ట్టుకున్న అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాయిగా ఓ సినిమాను చూడొచ్చు. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో వ‌చ్చిన సినిమాలు మ‌న టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి ఎన్టీఆర్ వరకు స్టార్ హీరోలు అంద‌రూ సిస్టర్ సెంటిమెంట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని అటు యూట్యూబ్, ఇటు ఓటీటీలోనూ అందుబాటులో ఉన్నాయి. మ‌చ్చుకు కొన్ని సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. – హిట్లర్ ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, రంభ జంటగా నటించారు. ముత్యాల సుబ్బయ్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో అన్నా చెల్లెళ్ల మూవీల్లో బెస్ట్ మూవీల్లో ఒక‌టి. ఇందులో ఐదుగురు అమ్మాయిలకు అన్నయ్యగా చిరు నటించారు. చెల్లెల్లు మంచి ఇళ్లకు కోడళ్లుగా వెళ్లాలని తాప‌త్ర‌ప‌డే అన్నయ్య పాత్రలో చిరు న‌ట‌న అదుర్స్‌. చిరు చెల్లెల్లుగా శారద, అనుపమ, లక్ష్మి, గాయత్రి, సరస్వతి నటించారు. – పుట్టింటికి రా చెల్లి యాక్షన్ హీరో అర్జున్ న‌టించిన చిత్రం పుట్టింటికి రా చెల్లి. చెల్లెలు సెంటిమెంట్‌తో తెర‌కెక్కింది. ఈ మూవీలో అర్జున్‌కు చెల్లిగా మధుమిత క‌నిపించింది. అన్నాచెల్లెలి మధ్య ఉండే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. మీనా హీరోయిన్‌గా న‌టించ‌గా కోడి రామకృష్ణ తెరకెక్కించారు. – గోరింటాకు ఈ మూవీలో రాజ‌శేఖ‌ర్‌, ఆర్తి అగర్వాల్ జంట‌గా న‌టించారు. రాజశేఖర్ చెల్లిగా మీరా జాస్మిన్ న‌టించింది. చిన్నతనంలోనే అమ్మానాన్న‌లు చనిపోవడంతో అన్నీ తానైన చెల్లిని పెంచి పెద్ద చేస్తాడు. చెల్లెలు ప్రేమించిన వ్య‌క్తితోనే పెళ్లి చేస్తాడు. అయితే.. ఆస్తి కోసం అయిన వాళ్లు చెల్లి భర్తను జైలుకు పంపిస్తారు. సాయం కోసం అన్నయ్య ఇంటికి వచ్చిన చెల్లిని ఆర్తి అగర్వాల్ అవమానించి పంపుతుంది. ఏం చేయాలో తెలియని మీరా జాస్మిన్ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటుంది. చెల్లి డెడ్ బాడీ దగ్గర రాజశేఖర్ ఏడ్వడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. – రాఖీ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించారు. త‌న చెల్లిని చంపిన అత్తింటి వారిని, వారికి వ‌త్తాసు ప‌లికిన అధికారుల‌ను త‌గ‌ల‌బెడ‌తాడు. ఆ త‌రువాత ఏ మ‌హిళ‌కు అన్యాయం జ‌రిగినా అన్న‌లా అండ‌గా నిలుస్తాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ చ‌క్క‌టి న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. అన్నవరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నాగా, తమిళ నటి సంధ్య చెల్లిగా నటించిన చిత్రం ‘అన్నవరం‘. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వ‌హించారు. అన్నవరం తన సోదరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అన్నాచెల్లెలి సెంటిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇవే కాకుండా మ‌హేష్ బాబు నటించిన అర్జున్, బాలకృష్ణ నటించిన ముద్దుల మావయ్య, సీనియర్ ఎన్టీఆర్ నటించిన రక్త సంబంధం, వెంకటేశ్ నటించిన గణేశ్, జగపతి బాబు నటించిన శివరామరాజు, కృష్ణ నటించిన సంప్రదాయ,శోభన్ బాబు నటించిన జీవనరాగం, చెల్లెలి కాపురం, బంగారు గాజులు, పల్నాటి పౌరుషం సినిమాలు కూడా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో తెర‌కెక్కిన మూవీలే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :