Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Committee Kurrollu collections : చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాలు సాధించిన మూవీలు చాలానే ఉన్నాయి. అలాంటి జాబితాలోకి చేరుతోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ కమిటీ కుర్రోళ్ళు. స్టార్ నటీనటులు లేరు.. యూట్యూబ్‌లో పాపులర్ అయిన వాళ్లు, కొత్త వాళ్లు మొయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఆగస్టు 9 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మూడు రోజుల్లో ఈ సినిమా 6.04 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు ఈ మూవీ ద్వారా తెలుగు సినిమాకు పరిచయం కావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ సినిమా మరెన్ని వసూళ్లను సాధిస్తుందో చూడాల్సిందే.
Admin
Studio18 News