Monday, 08 December 2025 03:20:00 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Wayanad Helping : అలనాటి హీరోయిన్స్ అంతా కలిసి వయనాడ్ కోసం భారీ విరాళం.. కేరళ సీఎంను కలిసి..

Date : 10 August 2024 01:58 PM Views : 163

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Wayanad Helping : ఇటీవల కేరళ వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగి పడి అనేకమంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కేరళలో వర్షాలు, వరదలు కారణంగా వయనాడ్ లో భారీ ప్రకృతి విపత్తు ఏర్పడింది. అక్కడి ప్రజలకు ఈ విపత్తు ఎంతో విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే 300 మందికి పైగా ఈ ఘటనలో చనిపోగా అనేకమంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో వయనాడ్ బాధితులకు దేశ వ్యాప్తంగా విరాళాలు వస్తున్నాయి. అనేకమంది సినిమా సెలబ్రిటీలు కూడా ఇప్పటికే కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందచేశారు. మన టాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ రెండు కోట్లు, చిరంజీవి, చరణ్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు, రష్మిక 10 లక్షలు, నిర్మాత నాగవంశీ 5 లక్షలు.. ఇలా పలువురు సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు. తమిళ, మలయాళ సినీ పరిశ్రమ నుంచి కూడా అనేకమంది ప్రముఖులు విరాళాలు అందచేశారు. అయితే తాజాగా అలనాటి సౌత్ హీరోయిన్స్ అంతా కలిసి డబ్బులు పోగేసి కోటి రూపాయలను కేరళ సీఎం పినరయి విజయన్ కు అందచేశారు. మీనా, కుష్బూ, సుహాసిని, మరికొంతమంది డైరెక్ట్ గా వెళ్లి కేరళ సీఎంకు కోటి రూపాయల చెక్కు అందచేశారు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ సీనియర్ నటి మీనా తన సోషల్ మీడియాలో.. చెన్నై నుంచి మేము కొంతమంది మా ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ తరపున వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల డబ్బులు పోగేసాం. కేరళ సీఎం పినరయి విజయన్ గారిని కలిసి కోటి రూపాయల చెక్కుని అందించాము. ఇందుకు సహకరించిన సుహాసిని, శ్రీప్రియ, కుష్బూ, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, లిస్సి లక్ష్మి, శోభన.. వీరి ఫ్యామిలీలకు అభినందనలు. వయనాడ్ కోసం మేము ప్రార్ధిస్తున్నాము అని పోస్ట్ చేసింది. దీంతో సీనియర్ నటీనటులు చేసిన ఈ పనికి వారిని అందరూ అభినందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :