Sunday, 15 March 2026 10:45:42 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Mangampeta : ‘మంగంపేట’ గ్లింప్స్ రిలీజ్.. చంపాల్సింది రాక్షసులని కాదు రావణుడిని..

Date : 06 September 2024 03:17 PM Views : 259

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mangampeta : చంద్రహాస్ కే, అంకిత సాహా జంటగా తెరకెక్కుతున్న సినిమా మంగంపేట. భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో గౌతం రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నాగ మహేష్, కబీర్ సింగ్, కాలకేయ ప్రభాకర్, దయానంద్ రెడ్డి, ఎస్తర్ నోరోన్హా, పృధ్వీరాజ్, అడుకలం నరేన్, సమ్మెట గాంధీ, సమీర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా అని అమ్మ కొడుకుని అడిగితే.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి ఊరిని చూపిస్తానమ్మా అని కొడుకు చెప్పే మాటలతో మొదలైన టీజర్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగింది. ఒక ఊరు ఊరులో బొగ్గు మాఫియా, అక్కడ ఉండే విలన్స్, వాళ్ళని హీరో ఎదిరించి తన తల్లిని ఊరికి ఎలా తీసుకెళ్లాడు అనే కథాంశంతో సినిమా రాబోతున్నట్టు ఈ మంగంపేట గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తుంది. చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని,‘రాముడు రాలేకపోవచ్చు.. శివుడు శూలాన్ని పంపిస్తే.. చేయాల్సింది యుద్దం కాదు శివ తాండవం’ లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ గ్లింప్స్ లోనే వినిపించారు. మీరు కూడా మంగంపేట గ్లింప్స్ చూసేయండి.. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది మంగంపేట సినిమా. ఈ గ్లింప్స్ తో ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :