Monday, 16 September 2024 06:17:30 PM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

The GOAT : ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)మూవీ రివ్యూ.. విజయ్ చివరి సినిమా ఎలా ఉంది?

Date : 05 September 2024 12:28 PM Views : 24

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : The GOAT Movie Review : తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘The Goat’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాతో నేడు సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది. స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, అజ్మీర్, జయరాం.. ఇలా పలువురు స్టార్స్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించడం, విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడంతో ఇదే విజయ్ లాస్ట్ సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ విషయానికొస్తే.. గాంధీ(విజయ్) తన టీమ్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గా స్పెషల్ మిషన్స్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం వాళ్ళ ఇళ్లల్లో కూడా తెలీదు. అనుకోకుండా థాయిలాండ్ లో జరిగే ఓ మిషన్ కి గాంధీ కడుపుతో ఉన్న తన భార్య(స్నేహ), కొడుకుని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో అటాక్ జరగడం, తన భార్యకి తనేం చేస్తాడో తెలియడం, తన కొడుకు తప్పిపోవడం జరుగుతాయి. అయితే తన కొడుకు ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని అందరూ అనుకుంటారు. దీంతో ఆ ఫీల్డ్ కి దూరమయి, భార్య, కూతురుకు దూరమయి బతుకుతుంటాడు గాంధీ. 16 ఏళ్ళ తర్వాత జాబ్ పర్పస్ రష్యా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ చిన్నప్పుడు చనిపోయాడు అనుకున్న తన కొడుకుని కలుస్తాడు. చిన్నప్పుడు చనిపోయిన కొడుకు జీవన్(విజయ్) మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? గాంధీ మళ్ళీ డ్యూటీలోకి వస్తాడా? గతంలో తను చేసిన మిషన్ లో చనిపోకుండా మిగిలిన ఓ వ్యక్తి గాంధీ పై ఎలా రివెంజ్ తీర్చుకోడానికి వస్తాడు? జీవన్ తిరిగొచ్చాక గాంధీ లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ.. చిన్నప్పుడు హీరో కొడుకు తప్పిపోయి విలన్ దగ్గర పెరిగి హీరో మీదకే రావడం గతంలో పలు సినిమాలు చూసాం. ఇది కూడా అదే కథ కానీ సీక్రెట్ మిషన్స్ నేపథ్యంలో కథనం చూపించారు. సినిమాలో డిఫరెంట్ స్క్రీన్ ప్లేకి అవకాశం ఉన్నా కథ ఒకే లైన్ లో వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ గాంధీ గురించి, గాంధీ చుట్టూ పక్కల పాత్రలు ఎస్టాబ్లిష్ చేయడం, కొడుకు తప్పిపోవడం పెద్దయ్యాక కొడుకు మళ్ళీ తిరిగి రావడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి గాంధీ కొడుకే విలన్ అని ఆడియన్స్ కి తెలిసేలా చూపించినా ఇది ఆడియన్స్ ముందే పసిగడతారు. ఇక సెకండ్ హాఫ్ గాంధీ, జీవన్ మధ్యలో జరిగే సంఘటనలు ఎత్తుకుపైఎత్తు అన్నట్టు సాగుతాయి. గాంధీ తన కొడుకే విలన్ అని ఎలా కనిపెట్టాడు, ఏం చేసాడు అనేది కొంచెం ఆసక్తిగానే చూపించారు. సినిమా నిడివి 3 గంటలు కావడంతో చాలా చోట్ల సినిమా సాగదీసినట్టు ఉంటుంది. అలాగే రెగ్యులర్ కథే కావడం, ట్విస్ట్ లు ముందే ఊహించడం జరుగుతుంది. సినిమాలో క్రికెట్ ఫ్యాన్స్ కి ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ కి మాత్రం మంచి ఫీస్ట్ ఉంటుంది. తండ్రి కొడుకులు హీరో – విలన్ గా కొట్టుకోవడం చూసి బోలెడన్ని పాత సినిమాలు గుర్తుకు వస్తాయి. కొన్ని సీన్స్ తప్పితే విజయ్ ని ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో డీ ఏజింగ్ చేసి పర్వాలేదనిపించారు. క్లైమాక్స్ ఓ పక్క క్రికెట్, ఓ పక్క యాక్షన్ సీన్స్ కంపారిజాన్ చేస్తూ చూపించిన విధానం మాత్రం బాగుంటుంది. నటీనటుల పర్ఫార్మెన్స్.. విజయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఆఫీసర్ క్యారెక్టర్స్ లో విజయ్ అదరగొడతాడు. ఇప్పుడు రెండు పాత్రల్లోను మెప్పించాడు. కానీ కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో విజయ్ ఎప్పుడు చేసే ఓవర్ యాక్టింగ్ తోనే కానిచ్చాడు. స్నేహ ఎమోషనల్ గా మెప్పిస్తుంది. మీనాక్షి చౌదరి ఓ పాటకి, కాసేపు కనిపించడానికే. ప్రభుదేవా, ప్రశాంత్, జయరాం, అజ్మీర్, వైభవ్, లైలా.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగా చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యువన్ శంకర్ రాజా బాగా ఇచ్చినా పాటలు మాత్రం వినడానికి కష్టమే. కథ, కథనం రెగ్యులర్. దర్శకుడిగా వెంకట్ ప్రభు ఇప్పటికే తన సినిమాలతో మెప్పించాడు. ఈ సినిమాలో కూడా డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. డీ ఏజింగ్ టెక్నిక్ గతంలో కొన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో బెటర్ అనుకోవచ్చు. నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు. మొత్తంగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ తండ్రి కొడుకుల వార్. ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ కి మాత్రమే ఫీస్ట్. మిగిలిన వాళ్లకి సాగదీతే. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :