Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తుంది హైడ్రా బృందం. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచి కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం హైడ్రా ప్రధాన లక్ష్యాలు. ఇప్పటికే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
Admin
Studio18 News