Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Double Ismart OTT : రామ్ పోతినేని నటించిన మూవీ డబుల్ ఇస్మార్ట్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీలో కావ్య థాపర్ కథానాయిక. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తో పాటు సాయాజీ షిండే, ప్రగతి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో మూవీ అందుబాటులో ఉంది. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయవచ్చు. కథ : అమ్మని చంపిన వ్యక్తిని వెతుకుతూ ఉంటాడు ఇస్మార్ట్ శంకర్. వాళ్ళ అమ్మని చంపింది బిగ్ బుల్(సంజయ్ దత్) అని తెలిసి అతని కోసం వెతుకుతూ అతని బిజినెస్, డబ్బులు టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జన్నత్(కావ్య థాపర్) పరిచయం అవడంతో ఆమెతో ప్రేమలో పడతాడు. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, డ్రగ్స్ మాఫియా డాన్, ఇల్లీగల్ బిజినెస్ లు చేస్తున్న బిగ్ బుల్ కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని తెలియడంతో మెమరీ ట్రాన్స్ఫర్ ద్వారా తాను చనిపోయినా తన ఆలోచనలు, జ్ఞాపకాలు ఉంచి ఎప్పటికి బతికేలా ఉండాలని అనుకుంటాడు. మెమరీ ట్రాన్స్ఫర్ కోసం మనుషుల్ని వెతుకుతుంటే ఇస్మార్ట్ శంకర్ గురించి తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో అతనికి మెమరీ ట్రాన్స్ఫర్ చేసారని తెలిసి మళ్ళీ అతన్నే పట్టుకుని బిగ్ బుల్ ఇండియాకు వచ్చి అతని బ్రెయిన్ లోకి మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇస్మార్ట్ శంకర్ తన జ్ఞాపకాలని మర్చిపోయాడా? బిగ్ బుల్ మెమరీ ఇస్మార్ట్ శంకర్ లోకి మొత్తం ట్రాన్స్ఫర్ అయిందా? రా ఆఫీసర్స్ బిగ్ బుల్ ని పట్టుకున్నారా? ఇస్మార్ట్ శంకర్ వాళ్ళ అమ్మని చంపిన బిగ్ బుల్ ని చంపాడా? మధ్యలో జన్నత్ తో ప్రేమ ఏమైంది.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Admin
Studio18 News