Sunday, 08 March 2026 10:46:11 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Gadadhari Hanuman : ‘గదాధారి హనుమాన్’.. డివోషనల్ టచ్‌తో మరో సినిమా..

Date : 02 September 2024 03:01 PM Views : 356

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Gadadhari Hanuman : ఇటీవల పలు సినిమాలు డివోషనల్ టచ్ తో వచ్చి మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇదే కోవలో మరి సినిమా రాబోతుంది. కొత్త నిర్మాణ సంస్థ విరభ్ స్టూడియోస్ సమర్పణలో రోహిత్ కొల్లి దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు. ‘గదాధారి హనుమాన్’ అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. రవి, హర్షిత, బసవరాజు హురకదలి, రమేష్ పండిట్, నగేష్ మైయ్య, కళ్యాణ్, సునంద.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ గదాధారి హనుమాన్ సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తిచేసి నవంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ గదాధారి హనుమాన్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తుంటే టైటిల్ లో ఆంజనేయుని జయకేతనం, టైటిల్ చివర హనుమంతుడి తోక ఉండగా పోస్టర్ వెనుక గమనిస్తే దహన సన్నివేశాలు లాగా అనిపిస్తున్నాయి. దీంతో గదాధారి హనుమాన్ సినిమా డివోషనల్ టచ్ తో రాబోతుందని తెలుస్తుంది. నిర్మాతలు బసవరాజు హురకదలి & రేణుక ప్రసాద్ కే.ఆర్ మాట్లాడుతూ.. గదాధారి హనుమాన్ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సరికొత్త అనుభూతితో వస్తారు. ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తీసాము. ఈ సినిమాని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తాము అని తెలిపారు. డైరెక్టర్ రోహిత్ కొల్లి మాట్లాడుతూ.. గదాధారి హనుమాన్ సినిమాలో అన్ని రకాల అంశాలు జోడించి ఒక డివైన్ టచ్ తో అద్భుతంగా తీసాము. మా సినిమా చూసాక కల్కి, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని ప్రేక్షకులు మాకు ఇస్తారు అని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :