Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Vishwak Sen : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన వానలతో, ఏర్పడిన వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు ఏపీ, తెలంగాణకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆయ్ మూవీ యూనిట్, కల్కి మూవీ యూనిట్ ఏపీకి విరాళాలు ప్రకటించాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని తెలిపారు. ఇదే బాటలో ఎన్టీఆర్ అభిమాని, హీరో విశ్వక్ సేన్ కూడా విరాళం ప్రకటించారు. విశ్వక్ సేన్ ముందు నుంచి తాను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్తూ వస్తున్నాడు. తన ఈవెంట్స్ కి ఎన్టీఆర్ ని తీసుకురావడం, ఎన్టీఆర్ గురించి రెగ్యులర్ గా మాట్లాడటం చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విశ్వక్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన కొన్ని నిమిషాలకే విశ్వక్ సేన్ కూడా ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు చెరో 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించాడు. ఈ మేరకు విశ్వక్ తన ట్విట్టర్లో.. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు వరదల నివారణ చర్యలకు గాను చెరో 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని ప్రకటిస్తున్నాను. వరదల వల్ల ప్రభావితులైన వారికి నా వంతు చిన్న సహాయం ఇది అంటూ పోస్ట్ చేసాడు. దీంతో విశ్వక్ ని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Admin
Studio18 News