Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ స్టార్ హీరో రవితేజకు ఆపరేషన్ జరిగింది. ఆయన కుడి చేతికి వైద్యులు సర్జరీ చేశారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... తన తాజా చిత్రం 'ఆర్ టీ 75' షూటింగ్ సమయంలో ఇటీవల రవితేజ గాయపడ్డారు. అయితే గాయాన్ని లెక్క చేయకుండా ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో గాయం మరింత పెద్దదయింది. దీంతో, చివరకు ఆయన చేతికి డాక్టర్లు సర్జరీ చేశారు. 'సామజవరగమన' చిత్రానికి రచయితగా పని చేసిన భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రవితేజ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
Admin
Studio18 News