Thursday, 12 March 2026 03:46:18 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Rajamouli : రాజమౌళి చిన్నప్పుడు కృష్ణుడిగా ఓ సినిమాలో నటించాడని తెలుసా? ఏ సినిమా అంటే..

Date : 03 August 2024 04:15 PM Views : 269

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rajamouli : తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరిగా నిలిచారు. RRR సినిమాతో తన సత్తా ప్రపంచానికి చాటారు. దీంతో రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఒక డాక్యుమెంటరీ చేసింది. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ రాజమౌళి పై ఒక డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, రమా రాజమౌళి, రానా.. ఇలా పలువురు మాట్లాడారు. హాలీవుడ్ డైరెక్టర్స్ రసో బ్రదర్స్, జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళి గురించి గొప్పనా చెప్పారు ఈ డాక్యుమెంటరీలో. దీంతో ప్రస్తుతం రాజమౌళి డాక్యుమెంటరీ ట్రెండ్ అవుతుంది. అయితే వీరంతా రాజమౌళి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజమౌళి చిన్నప్పుడు ఒక సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించినట్లు తెలిపాడు. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ కలిసి ‘పిల్లన గ్రోవి’ అనే సినిమాని నిర్మించడం మొదలు పెట్టారు. ఆ సినిమాకి శివశక్తి దత్తా దర్శకుడు. కానీ ఆ సినిమా పలు కారణాలతో ఆగిపోయింది. ఆ సినిమా వీళ్ళకు చాలా నష్టాలనే మిగిల్చింది. రాజమౌళి చిన్నప్పుడు ఈ సినిమా కోసం కృష్ణుడి గెటప్ వేసిన ఫోటోని కూడా డాక్యుమెంటరీలో చూపించారు. దీంతో ఆ ఫోటో వైరల్ గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :