Monday, 19 January 2026 06:50:17 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Pawan Kalyan – Balakrisha : పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదంటే.. బాలయ్య 50 ఏళ్ళ నట స్వర్ణోత్సవ వేడుకల్లో జనసేన మంత్రి..

Date : 02 September 2024 11:24 AM Views : 288

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan – Balakrisha : బాలకృష్ణ 1974లో తాతమ్మ కల సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నిన్న రాత్రి గ్రాండ్ గా బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించింది. బాలయ్య బాబు 50 ఏళ్ళ నట స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, శ్రీకాంత్, నాని, ఉపేంద్ర, శివన్న, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, రానా, మంచు మనోజ్, రాఘవేంద్రరావు, బోయపాటి, తమన్.. ఇలా ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఏపీలో కూడా పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో చంద్రబాబు, పవన్ అక్కడ సహాయక కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఏపీలో పరిస్థితులు వర్షాల వల్ల అలా ఉండటంతో బాలకృష్ణ ఈవెంట్ కి సీఎం చంద్రబాబు నేను రాలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక పవన్ కళ్యాణ్ తరపున జనసేన మంత్రి, ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పాటు నటిస్తూ 50 ఏళ్ళ పాటు భారతదేశంలో ఉన్న తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలయ్య గారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతఙ్ఞతలు. ఈరోజు ఆయనతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆయనతో అసెంబ్లీలో కూడా కూర్చుంటున్నాం. 100 ఏళ్ల పాటు ఆయన ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అక్కడ సహాయక చర్యల్లో ఉన్నారు. బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియచేసారు. బాలయ్య గారు సినిమా, వైద్య, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :