Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : NTR – Prashanth Neel : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. అయితే తాజాగా ఈ సినిమా కథ ఇదే అని ఒక కథ వినిపిస్తుంది. ఎన్టీఆర్ – నీల్ సినిమా ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో వెనక చిన్నగా కనపడేలా 1969 అని, గోల్డెన్ ట్రయాంగిల్ అని రాసుంది. అలాగే కొంచెం ఇండియా మ్యాప్ కూడా ఉంది. దీంతో 1969లో జరిగిన కథ అని తెలుస్తుంది. భూటాన్, చైనా, ఇండియా దేశాల్లోని పలు ప్రాంతాలని కలుపుతూ ఉన్న ప్రదేశాన్ని గతంలో గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా ఉండేది. దగ్గర్లో ఉన్న కలకత్తా పోర్ట్ నుంచి డ్రగ్ ఎగుమతి, దిగుమతి అయ్యేది. ఈ డ్రగ్ మాఫియా లీడర్ గా కౌన్ సా అనే వ్యక్తి ఉండేవాడు. ఇతన్ని అక్కడ ఉన్న లోకల్ ఆర్మీ సహాయంతో ఎన్నో ప్రయత్నాల తర్వాత అతన్ని అరెస్ట్ చేసారు. బర్మా, ఇండియా, భూటాన్, చైనా దేశాలను ఈ కౌన్ సా గడగడలాడించాడని, అతన్ని పట్టుకోడానికి నాలుగు దేశాలు చాలా ప్రయత్నాలు చేశాయని చరిత్రలో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఆ డ్రగ్ లీడర్ కౌన్ సా పాత్ర చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఫుల్ పవర్ ఫుల్ గా ఈ పాత్రను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఇది మూవీ యూనిట్ అనౌన్స్ చేసిన పోస్టర్ ఆధారంగానే అందరూ అనుకుంటున్నారు కానీ అధికారికంగా ఈ సినిమా కథపై ఎలాంటి ప్రకటన లేదు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఫుల్ మాస్ గా చూపిస్తాడని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Admin
Studio18 News