Monday, 08 December 2025 03:10:18 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Raj Tarun : రాజ్‌త‌రుణ్‌ను నిల‌దీస్తానంటున్న లావ‌ణ్య‌..! ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకున్న పోలీసులు..!

Date : 31 July 2024 04:07 PM Views : 188

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ గ‌త కొన్నాళ్లుగా ఓ వివాదంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. లావ‌ణ్య అనే యువ‌తి రాజ్‌త‌రుణ్ పై కేసు పెట్టింది. రాజ్‌త‌రుణ్‌తో ప‌దేళ్ల‌కు పైగా క‌లిసి జీవించాన‌ని, రాజ్ న‌న్ను పెళ్లి చేసుకుని అబార్ష‌న్ చేయించాడ‌ని, హీరోయిన్ మాల్కి మ‌ల్హోత్రాని వివాహం చేసుకోబోతున్నాడ‌ని ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్ప‌టికే రాజ్‌త‌రుణ్‌కు నోటీసులు పంపారు. ఈ విష‌యం పై రాజ్‌త‌రుణ్ ఓ సారి స్పందించాడు. ఆమెతో త‌న‌కు బ్రేక‌ప్ అయింద‌ని, ఆమె చెప్పేవ‌న్ని నిజం కాద‌న్నాడు. ఆ త‌రువాత ఫోన్ నంబర్ మార్చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మ‌రోవైపు మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై కేసు పెట్టింది. కాగా.. రాజ్ తరుణ్ హీరోగా చేసిన తిరగబడరా సామీ సినిమా ఆగస్టు 2 న విడుద‌ల కాబోతుంది. ఈ రోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కి రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రి కూడా వస్తారని సమాచారం వచ్చింది. లావ‌ణ్య విష‌యంపై రాజ్‌త‌రుణ్ స్పందిస్తాడా..? లేక సినిమా గురించి మాత్ర‌మే మాట్లాడ‌తాడా అని ఎదురుచూస్తుండ‌గా ప్ర‌సాద్ ల్యాబ్‌కు పోలీసులు చేరుకున్నారు. రాజ్‌త‌రుణ్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌కు వ‌స్తున్నాడ‌నే విష‌యం తెలిసి.. అత‌డిని నిల‌దీసేందుకు లావ‌ణ్య అక్క‌డ‌కు వ‌స్తుంద‌న్న స‌మాచారంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :