Thursday, 12 March 2026 03:44:43 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Jr NTR: మ‌హేశ్ అన్నా.. హ్యాపీ బ‌ర్త్ డే: ఎన్‌టీఆర్

Date : 09 August 2024 01:45 PM Views : 274

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నేడు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా జూనియ‌ర్ ఎన్‌టీఆర్ కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌హేశ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. 'పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు మ‌హేశ్ అన్నా. ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాల‌ని కోరుకుంటున్నా..' అంటూ తార‌క్ ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే.. ఈ రోజు ప్రిన్స్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీజ్ అయింది. దాంతో ఫ్యాన్స్‌ థియేటర్లలో పండగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కేరింతలు, కేకలు సందడే సందడి. మహేశ్‌ బాబు, సొనాలి బింద్రే కాంబోలో దర్శకుడు కృష్ణవంశీ 2001లో మురారి చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీకి గాను సూప‌ర్ స్టార్‌కు స్పెషల్ జ్యూరీ విభాగంలో నంది అవార్డు కూడా దక్కిన విష‌యం తెలిసిందే. ఇక ప్రిన్స్‌ ఇటీవలే 'గుంటూరు కారం' చిత్రంతో అభిమానుల‌ను అల‌రించారు. త్వరలోనే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌ రాజమౌళితో చేయబోతున్న సినిమా చేయ‌నున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :