Sunday, 08 March 2026 10:36:13 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Bandla Ganesh – Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ సీట్స్ ఇరగ్గొడతారు థియేటర్స్ ఇవ్వం అంటున్న ఎగ్జిబిటర్స్.. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసిన బండ్లన్న..

Date : 31 August 2024 01:52 PM Views : 291

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Bandla Ganesh – Pawan Kalyan : స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ చేస్తారని తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాములు హడావిడి ఉండదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ సినిమా రీ రిలీజ్ కి థియేటర్స్ దొరకట్లేదట. కొంతమంది ఎగ్జిబిటర్లు థియేటర్స్ ఇవ్వట్లేదట. పవన్ ఫ్యాన్స్ రచ్చ చేసి థియేటర్స్ నాశనం చేస్తారు, సీట్స్ ఇరగ్గొడతారు అని థియేటర్స్ ఇవ్వము అని చెప్తున్నారంట. తాజాగా దీనిపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీట్స్ ఇరగ్గొడతారు థియేటర్స్ ఇవ్వము అని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. దయచేసి అడుగుతున్నాను థియేటర్స్ ఇవ్వండి. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు మారారు. మా వాళ్ళు సీట్స్ ఇరగ్గొట్టరు. మా బాస్ మొన్నటిదాకా పవర్ స్టార్ అప్పుడు రచ్చ వేరు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పద్దతిగా ఉంటారు. మాకు బాధ్యత ఉంది. ఒక పవన్ అభిమానిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గబ్బర్ సింగ్ సినిమాకు థియేటర్స్ ఇవ్వండి. ఉదయం గుడికి వెళ్లి పవన్ కళ్యాణ్ బాగుండాలని దండం పెట్టుకొని తర్వాత థియేటర్ కి వచ్చి గబ్బర్ సింగ్ సినిమా చూస్తాం మా ఫ్యాన్స్ అంతా. తమ్ముళ్లు మీరు కూడా థియేటర్స్ లో సీట్స్ ఇరగ్గొట్టకండి ఇప్పుడు మన బాస్ పొజిషన్ వేరు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. మరి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి అనుకున్నానని థియేటర్స్ వస్తాయా చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :