Monday, 08 December 2025 04:18:47 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది ఫస్ట్ సినిమా ఆగిపోయిందా? హీరో ఇలా.. నిర్మాత అలా..

Date : 10 August 2024 03:43 PM Views : 210

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్దిగా నార్నె నితిన్ టాలీవుడ్ కి పరిచయం అవుతూ శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాని ప్రకటించారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాకుండానే మ్యాడ్ సినిమాతో నార్నె నితిన్ ప్రేక్షకులని పలకరించాడు. మ్యాడ్ సినిమా మంచి హిట్ అవ్వడంతో పాటు, ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ అని అందరికి గుర్తుండిపోయాడు. ఇప్పుడు త్వరలో ఆగస్టు 15న ఆయ్ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు నితిన్. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆల్రెడీ మ్యాడ్ సినిమా వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఆయ్ సినిమా రాబోతుంది కానీ అసలు నార్నె నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ అనౌన్స్ చేసిన సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు మాత్రం ఇంకా రాలేదు. ఇటీవల సంక్రాంతికి ఆ సినిమా నిర్మాత ఆల్రెడీ సినిమా రెడీ అయింది, త్వరలోనే శ్రీశ్రీశ్రీ రాజావారు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ తాజాగా ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో నార్నె నితిన్ మీడియాతో మాట్లాడగా శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమా ప్రస్తావన రావడంతో ఆ సినిమా పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. నిర్మాత ఏమో త్వరలో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తే, హీరో ఏమో ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అని చెప్పడం చర్చగా మారింది. మరి ఇంతకీ ఆ శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమా రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాని శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మాణంలో వేగేశ్న సతీష్ దర్శకత్వంలో ప్రకటించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :