Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Vijay Deverakonda – VD12 : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి నిన్నే ఓ అదిరిపోయే విజయ దేవరకొండ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. VD12 సినిమా 2025 మార్చి 28న విడుదల కానున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో శరవేగంగా జరుగుతుంది. పీరియాడిక్ స్పై యాక్షన్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. తాజాగా సినిమా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో VD12 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. VD12 సినిమా స్పై థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాకి రెండు పార్టులు ఉన్నాయి. ముందు ఒకటే సినిమా అనుకున్నాము. అయితే గౌతమ్ కథ పరంగా చాలా ఎక్కువగా రాసుకున్నాడు. దాన్ని మొత్తం తీయొచ్చు. దీంతో ఫస్ట్ పార్ట్ అదిరిపోయే ఎండింగ్ ఉంటుంది. ముందు ఫస్ట్ పార్ట్ మాత్రమే షూట్ చేస్తాము. ఫస్ట్ పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ తర్వాత సెకండ్ పార్ట్ షూట్ చేస్తాము అని తెలిపారు. దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే VD12 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ తో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాడు.
Admin
Studio18 News