Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : MS Dhoni – Vijay : కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన మూవీ ది గోట్ (గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ కీలక పాత్రలను పోషించారు. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నేడు (సెప్టెంబర్ 5)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు పూర్తి అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ మూవీలో హీరోలు అజిత్, శివకార్తీకేయన్ లతో పాటు ఓ సీన్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం కనిపించాడట. ధోనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ధోని పెవిలియన్ నుంచి క్రీజులోకి వెలుతుండగా.. ధోని పైకి చూస్తాడు. అప్పుడు స్టేడియం టాప్ పై విజయ్ బైక్ రైడ్ చేస్తూ కనిపించాడు. ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో ధోని, విజయ్ ఫ్యాన్స్ అరుపులతో దద్దరిల్లిపోయాయి. తలా.. తలా అంటూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Admin
Studio18 News