Thursday, 12 March 2026 04:31:00 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chiranjeevi : మెగా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. త్వ‌ర‌లోనే ‘ఇంద్ర‌’, ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’ సీక్వెల్స్‌..

Date : 27 August 2024 02:19 PM Views : 205

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chiranjeevi – Aswani Dutt : మెగాస్టార్ చిరంజీవి న‌టించిన బ్లాక్ బాస్ట‌ర్ చిత్రాల్లో ‘ఇంద్ర‌’, ‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’ కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాల‌ను వైజ‌యంతీ బ్యాన‌ర్‌లో అశ్వినీద‌త్ నిర్మించారు. ఇక ఈ చిత్రాల‌కు సీక్వెల్స్‌ను తెర‌కెక్కించాల‌ని ఎన్నో రోజులుగా అభిమానులు డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. ఎట్ట‌కేల‌కు దీనిపై నిర్మాత అశ్వినీ ద‌త్ స్పందించారు. ఫ్యాన్స్‌కు పండ‌గ‌లాంటి వార్త‌ను చెప్పారు. చిరు 69వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న ఇంద్ర మూవీని రిరీలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. రి రీలీజ్‌లోనూ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ నేప‌థ్యంలో చిరంజీవి ఇంద్ర మూవీ యూనిట్‌ను త‌న ఇంటికి పిలిపించుకున్నారు. ఆత్మీయ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్, ద‌ర్శ‌కుడు బి.గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత ద‌ర్శ‌కుడు మణిశర్మ, రైట‌ర్‌ చిన్ని కృష్ణ లు చిరు ఇంటికి వ‌చ్చారు. వీరంద‌రికి శాలువా క‌ప్పి స‌న్మానించారు చిరు. అంతేకాదండోయ్ నిర్మాత అశ్వినీద‌త్‌కు పాంచ‌జ‌న్యాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. అనంత‌రం ఇంద్ర చిత్రానికి సంబంధించిన స్మృతుల‌ను గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను “ఇంద్ర భ‌వ‌నంలో స‌త్కారం” పేరిట వైజ‌యంతీ మూవీస్ వీడియోను విడుద‌ల చేసింది. చిరు రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావ‌డం లేద‌ని నిర్మాత అశ్వినీద‌త్ అన్నారు. ‘ఇంద్ర’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలకు సీక్వెల్స్ తీస్తాన‌ని ఆయ‌న వీడియో చివ‌ర్లో చెప్పారు. ఆ త‌రువాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు సీక్వెల్స్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని వెల్ల‌డించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :