Sunday, 08 March 2026 09:40:57 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Pawan Kalyan : అక్కచెల్లమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది.. రాఖీ శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Date : 19 August 2024 12:02 PM Views : 237

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan : రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. ర‌క్షాబంధ‌న్ అనేది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక అని అన్నారు. శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఆనందాల వేడుక అని తెలిపారు. ఈ శ్రావణ పౌర్ణమి దేశవాసులందరికీ శుభాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుంది. అక్కచెల్లమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. విప్లవ కవి గద్దరన్న పాడినట్లు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో.. అక్క నుదుటున తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో! అదేవిధంగా అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? వీరిని జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప! అటువంటి అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ పండుగ శుభతరుణాన సోదర సోదరీమణులందరికీ అనురాగపూర్వక శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతితో భాగమైన ఈ వేడుకను శ్రావణ పౌర్ణమినాడు ప్రేమైక మనస్సులతో భారతీయులతో పాటు దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగ చేసుకోవడం సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీక. ఈ శ్రావణ పౌర్ణమి దేశవాసులందరికీ శుభాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు.’ అని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :