Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mahesh Babu : గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మహేష్ బాబు రాజమౌళితో సినిమా మొదలుపెట్టడానికి ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు కావాల్సినట్టుగా జుట్టు, బాడీ పెంచి లుక్ మార్చాడు. మహేష్ ఇటీవల ఎక్కడ కనపడ్డా మహేష్ లుక్ మాత్రం వైరల్ అవుతుంది. మహేష్ కి ఈ లుక్ అదిరిపోయింది అంటున్నారు. తాజాగా మహేష్ బాబు ఓ స్టూడియోకి వెళ్లగా అక్కడ పలువురు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. పలువురికి మహేష్ ఫోటోలు, సెల్ఫీలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ కూడా దగ్గరికి వచ్చి సెల్ఫీ కోరగా మహేష్ ఆయనకు సెల్ఫీ ఇచ్చాడు. దీంతో మహేష్ బాబు తాజా వీడియో వైరల్ గా మారింది.
Admin
Studio18 News