Sunday, 25 January 2026 06:03:38 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Stree 2: 'కల్కి 2898 ఏడీ' రికార్డు బ్రేక్‌.. ఈ ఏడాది బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా 'స్త్రీ 2'

Date : 16 August 2024 01:21 PM Views : 441

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్దా క‌పూర్, రాజ్ కుమార్ రావు కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘స్త్రీ 2’. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా గురువారం ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సినిమాకు హిట్‌ టాక్ రావ‌డంతో మొద‌టి రోజు రికార్డు స్థాయి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఏకంగా రూ. 54.35 కోట్లు కొల్ల‌గొట్టింది. నిన్న మూవీకి రూ. 46కోట్ల క‌లెక్ష‌న్లు రాగా, బుధ‌వారం ప్రివ్యూస్ రూపంలో రూ. 8.35 కోట్లు వ‌చ్చాయి. ఇలా మొత్తంగా తొలిరోజునే రూ.54.35 కోట్ల కలెక్షన్లు రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ పేర్కొంది. దీంతో ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ఫైటర్‌, కల్కి 2898 ఏడీ (హిందీ) ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌ను డబుల్ మార్జిన్‌తో క్రాస్ చేసింది 'స్త్రీ2'. ఈ రెండు చిత్రాలు తొలిరోజు వ‌రుస‌గా రూ.22-24 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఏకంగా డబుల్ మార్జిన్‌తో ఈ ఫిగర్‌ను 'స్త్రీ 2' ఓవర్‌టేక్‌ చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. బాలీవుడ్‌లో 2024లో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలవడమే కాకుండా.. ఆల్ టాప్‌ 10 హిందీ సినిమా ఓపెనర్ల జాబితాలో ‘స్త్రీ 2’ స్థానం సంపాదించ‌డం విశేషం. గురువారం రూ. 46 కోట్ల క‌లెక్ష‌న్ల‌తో ‘స్త్రీ 2’... 'బాహుబలి 2' హిందీ (రూ. 41 కోట్లు), 'భారత్' (రూ. 42.3 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్' (42.62 కోట్లు), 'టైగర్ 3' (రూ. 43 కోట్లు) వంటి చిత్రాలను బీట్ చేసింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద 7వ ఆల్ టైమ్ బాలీవుడ్ ఓపెనర్‌గా అవతరించింది. ఇక‌ పెయిడ్ ప్రివ్యూలను కలిపి తొలిరోజు మొత్తం రూ. 54.35 కోట్లుగా తీసుకుంటే, ‘స్త్రీ 2’ ఆల్ టైమ్ టాప్ 4 బాలీవుడ్ ఓపెనర్‌గా నిలిచింది. 'యానిమల్' (రూ. 54.75 కోట్లు), 'పఠాన్' (రూ. 55 కోట్లు), 'జవాన్' (రూ. 65.5 కోట్లు). అటు హీరోహీరోయిన్ రాజ్‌కుమార్ రావ్‌, శ్రద్ధా కపూర్‌లకు కూడా కెరీర్‌ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఈ మూవీ నిల‌వ‌డం విశేషం. కాగా, నిన్న విడుద‌లైన మ‌రో రెండు హిందీ చిత్రాలు అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే', జాన్ అబ్రహం 'వేద'. ఈ రెండు సినిమాలు ‘స్త్రీ 2’ దెబ్బ‌కు కుదేల‌య్యాయి. ఈ మూవీ మొద‌టి వారాంతంలోనే బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల నెట్ మార్క్‌ను అధిగమించవచ్చని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక అమర్‌ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో కామెడీ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఫస్ట్ లుక్‌, ట్రైల‌ర్ మూవీపై సూపర్ హైప్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో న‌టించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :