Monday, 08 December 2025 03:54:06 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Chinmayi Sripada: చిత్ర పరిశ్రమపై సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన వ్యాఖ్యలు

Date : 26 August 2024 03:19 PM Views : 222

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : చిత్ర పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’పై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా హేమ కమిటీ నివేదికపై స్పందించారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై నియమించిన ఈ కమిటీ ఇటీవల కేరళ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై చిన్మయి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. సినీ పరిశ్రమలో పరిస్థితి గురించి, నేరస్తులకు ఉన్న రాజకీయ అనుబంధాల గురించి విడమరిచి చెప్పారు. హేమ కమిటీలోని సభ్యులు, విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్లూసీసీ) సభ్యులకు సింగర్ హ్యాట్సాఫ్ చెప్పారు. సినీ పరిశ్రమకు చెడ్డ పేరు వచ్చిందని, ఇక్కడ లైంగిక వేధింపులు సర్వసాధారణం అని చాలామంది విశ్వసిస్తారని చెప్పారు. తమిళ పాటల రచయిత వైరముత్తు నుంచి తాను స్వయంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, ఆ కేసులో తాను పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. చాలా చిత్ర పరిశ్రమల్లో నేరస్తులు కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. ఆమె దీనిని ‘అధికారం, రాజకీయాలు, డబ్బు బంధం‘గా అభివర్ణించారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులతో రాజకీయ సంబంధాలు నేరస్తులకు శిక్ష పడకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు. మనం ఓ సమస్య గురించి ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. కేసు సంవత్సరాలు, దశాబ్దాలపాటు సాగుతుందన్నారు. తాను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు చెప్పారు. ఏడేళ్లు అయినా ఆ కేసు ఎక్కడుందో ఇప్పటికీ తనకు తెలియదని వాపోయారు. ‘‘నేను వేధింపులకు గురయ్యానని చెప్పాను. ఇండస్ట్రీలో ఇక నిన్ను పనిచేయనివ్వబోమని వారు చెప్పారు’’ అని చిన్మయి చెప్పుకొచ్చారు. అధికారం, రాజకీయాలు, డబ్బు పెనవేసుకుంటే జరిగేది ఇదేనని వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :