Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Nadiminti Narasingarao : కృష్ణవంశీ గులాబీ, రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒకరోజు సినిమాలతో పాటు తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలకు మాటల రచయితగా, పాటల రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు నేడు ఉదయం మరణించారు. వయోభారంతో, పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నడిమింటి నరసింగరావును ఆయన కుటుంబసభ్యులు ఇటీవల హైద్రాబాదు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చెరిపించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారం రోజుల క్రితం నడిమింటి నరసింగరావు కోమాలోకి వెళ్లారు. చికిత్స తీసుకుంటూనే నేడు బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు. 72 ఏళ్ళ వయసులో ఆయన మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినిమాల్లోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న నడిమింటి నరసింగరావు ఆ తర్వాత తెనాలి రామకృష్ణ, వండర్ బోయ్, లేడీ డిటెక్టవ్, అంతరంగాలు.. ఇలా పలు సూపర్ హిట్ సీరియల్స్ కి కూడా రచయితగా పనిచేసారు. ఆ తర్వాత సినిమా రచయితగా మారి అనేక సినిమాలకు మాటలు, పాటలు అందించారు. నడిమింటి నరసింగరావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Admin
Studio18 News