Monday, 08 December 2025 03:28:32 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Sirivennela Seetharama Sastry : ఆ పాట రాయడం కోసం సీతారామ శాస్త్రిని మొదటిసారి పబ్‌కి తీసుకెళ్లిన దర్శకుడు..

Date : 23 July 2024 11:50 AM Views : 228

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sirivennela Seetharama Sastry : ఎన్నో అర్థవంతమైన పాటలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన లేకపోయినా ఆయన పాటలు, ఆ పాటల భావాలు ఇప్పటికి మనల్ని వెంటాడుతాయి. ఇటీవల సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు వచ్చి సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. తాజాగా ఈ నా ఉఛ్వాసం కవనం ఇంటర్వ్యూకి దర్శకుడు కృష్ణవంశీ వచ్చారు. కృష్ణవంశీకి, సిరివెన్నెల సీతారామశాస్త్రికి మంచి అనుబంధం ఉంది. కృష్ణవంశీ సినిమాలకు ఆల్మోస్ట్ చాలా పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసారు. కృష్ణవంశీ గొప్ప సినిమాల్లో ఖడ్గం ఒకటి. ఈ సినిమాలో మనసు వేయొద్దు ముసుగు మీద.. సాంగ్ రాసినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని ఇంటర్వ్యూలో తెలిపారు.కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఖడ్గం సినిమా ఒక ఎమోషన్. అందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద సాంగ్ పబ్ లాంటి ప్లేస్ లో ఉంటుంది. అలాగే ఆ పాట పబ్ సాంగ్ లా ఉన్నా ఆ లిరిక్స్ చూస్తే చాలా స్ఫూర్తినిచ్చే సాంగ్ లా ఉంటుంది. ఈ సాంగ్ రాయమని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని అడిగినప్పుడు నాకు పబ్ లో ఎలా ఉంటుందో తెలియదు, అందుకే రాయడం కష్టమవుతుంది అన్నారు. దీంతో మొదటిసారి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని పబ్ కి తీసుకెళ్ళాను. అక్కడి వాతావరణాన్ని గమనించి ముసుగు వెయ్యొద్దు మనసు మీద..అనే గొప్ప సాంగ్ రాసిచ్చారు. ఆ పాటతో యూత్ కి ఫిలాసఫీ చెప్పారు అని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :