Monday, 08 December 2025 03:20:39 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

NTR : బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ లైనప్ అదిరిపోయిందిగా.. ఎన్టీఆర్ నెక్స్ట్ మూడు సినిమాల రిలీజ్‌లు ఎప్పుడంటే..

Date : 10 August 2024 11:13 AM Views : 188

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : NTR Movies : RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న దేవర సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుండటంతో దేవర పార్ట్ 1 సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు. ఇక దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో రాబోతున్నాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ సినిమా కావడం, అది కూడా స్పై యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. వార్ 2 సినిమా వచ్చే సంవత్సరం 2025 ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా రాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాని నిన్నే పూజా కార్యక్రమాలతో ప్రకటించారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఎన్టీఆర్ – నీల్ సినిమా 2026 జనవరి 9న వస్తుందని ప్రకటించారు. ఈ మూడు సినిమాల తర్వాత దేవర పార్ట్ 2తో పాటు త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంటుందని సమాచారం. దీంతో ఎన్టీఆర్ లైనప్ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఎన్టీఆర్ లైనప్ చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :