Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chiranjeevi – Allu Ramalingaiah : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రతి పండగని ఘనంగా, సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసుకుంటారని తెలిసిందే. ఇటీవల కృష్ణ్ణష్టమి వేడుకలు కూడా చిరు ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా, చిరు కుటుంబ సభ్యులు చిరు ఇంట్లోని పూజ మందిరంలో కృష్ణుడికి పూజలు చేసారు. అయితే ఈ పూజకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. చిరంజీవి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుడి ఫొటోలతో పాటు చిరంజీవి నాన్న వెంకట్రావు ఫొటో, చిరంజీవి మామయ్య అల్లు రామలింగయ్య ఫోటో కూడా పెట్టుకున్నారు. దేవుళ్లతో పాటు వాళ్ళని కూడా దేవుళ్ళుగా భావిస్తూ పూజా మందిరంలో వారి ఫోటోలను పెట్టి పూజలు నిర్వహించడం గమనార్హం. దీంతో చిరంజీవి పూజా మందిరం ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఇటీవల అల్లు అర్జున్ – మెగా ఫ్యామిలీ మధ్య ఇష్యూ ఇంకా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి పూజా మందిరంలో నాన్నతో పాటు మామయ్య అల్లు రామలింగయ్య ఫోటో కూడా పెట్టి చిరు పూజలు నిర్వహిస్తుండటంతో మరోసారి మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Admin
Studio18 News