Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Thaman Mother : తెలుగు ఓటీటీ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రతి వారం పాటలతో, కామెడీతో, ఎవరో ఒకరు స్పెషల్ గెస్ట్ గా సాగిపోతుంది ఈ షో. తాజాగా ఈ షోకి తమన్ తల్లి గెస్ట్ గా హాజరయ్యారు. తమన్ తల్లి వచ్చినా ఎపిసోడ్స్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అది వైరల్ గా మారింది. దీనికి సంబంధిన ఎపిసోడ్స్ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ షోలో తమన్ గురించి వాళ్ళ అమ్మ చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. తమన్ ని తాను సాయి, సాయి నాన్న అని పిలుస్తున్నట్టు తెలిపింది. తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. అలాగే తమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలోనే ఎక్కువగా వుండేవాడని, అస్సలు భయం లేదని, అల్లరి చేసేవాడని, స్కూళ్లలో గొడవలు పెట్టుకునేవాడని, పక్కన పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని చెప్పింది. కానీ ఎన్ని అల్లరి పనులు చేసినా పని విషయంలో మాత్రం బాగా కష్టపడతాడు అని తెలిపింది. తమన్ హార్డ్ వర్క్ చేస్తాడని, వర్క్ అయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని, తనకి సంగీతం, క్రికెట్ తప్ప మరో ప్రపంచం లేదని.. ఇలా అనేక విషయాలు చెప్పారు తమన్ తల్లి. ఆ ప్రోమో మీరు కూడా చూసేయండి..
Admin
Studio18 News