Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Puri Jagannadh : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాధ్ ఒకరు. కానీ ఇటీవల పూరికి సరైన హిట్ పడలేదు. పూరి గత సినిమా విజయదేవరకొండ లైగర్ పరాజయం పాలైంది. లైగర్ ఫ్లాప్ అవ్వడంతో పూరి పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పూరి జగన్నాధ్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ సినిమాతో రాబోతున్నాడు. డబల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా వరంగల్ లో డబల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. లైగర్ ఫ్లాప్ అయ్యాక నాకు విజయేంద్రప్రసాద్ గారి దగ్గర్నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చూసి ఈయన నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అనుకున్నాను. లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఆయన నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారు అని అడిగితే ఇంకా ఏమి అనుకోలేదు అన్నాను. ఆయన నెక్స్ట్ సినిమా కథ అనుకున్నాక ఒకసారి నాకు చెప్పండి. ఎందుకంటే మీలాంటి డైరెక్టర్స్ ఫ్లాప్స్ తీస్తుంటే నేను చూడలేకపోతున్నాను. నేనేమైనా నా వల్ల అయితే కథలో సహాయం చేస్తాను అని చెప్పారు. అంత పెద్దాయన నాకు ఫోన్ చేసి అలా మాట్లాడేసరికి ఎమోషనల్ అయ్యాను. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని ఈ కథ రెడీ చేసుకున్నాను అని తెలిపారు. దీంతో పూరి జగన్నాధ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పూరి జగన్నాధ్ కి పెద్ద అభిమాని అని తెలిసిందే. గతంలో అనేకసార్లు విజయేంద్ర ప్రసాద్ తాను పూరి జగన్నాధ్ ఫ్యాన్ అని చెప్పారు. తన ఫోన్ వాల్ పేపర్ గా పూరి జగన్నాధ్ ఫోటో పెట్టుకున్నది కూడా చూపించారు. తన ఫేవరేట్ డైరెక్టర్ ఇలా ఫ్లాప్స్ తీస్తున్నాడని ఆవేదన చెంది పూరికి కాల్ చేయడంతో పలువురు పూరి ఫ్యాన్స్ ఆయన్ని అభినందిస్తున్నారు.
Admin
Studio18 News