Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సినిమాలు లేకపోతే తన జీవితం లేదని మలయాళ సూపర్ స్టార్, కేంద్ర సహాయమంత్రి సురేశ్ గోపీ అన్నారు. ప్రస్తుతం తాను 20 నుంచి 22 సినిమాలకు కమిట్ అయ్యాయని వెల్లడించారు. ఈ సినిమాల్లో నటించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అనుమతి కోరారని చెప్పారు. ఎన్ని సినిమాలు అని అడిగారని, తాను 22 సినిమాలు అని చెప్పానని, దాంతో ఆయన తన లేఖను పక్కనబెట్టేశారని సురేశ్ గోపి వివరించారు. అయితే అనుమతి ఇస్తారనే భావిస్తున్నానని తెలిపారు. కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిని కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని... ఈ పదవిలో కొనసాగాలని తాను ఇప్పుడు కూడా కోరుకోవడం లేదని చెప్పారు. తన అభిమానులను మెప్పించడమే తనకు ముఖ్యమని అన్నారు. ఫిల్మ్ షూటింగ్ సెట్లలో తనతో పాటు ముగ్గురు అధికారులు ఉంటారని... వారికి సెట్స్ లో అన్ని ఏర్పాట్లు ఉంటాయని సురేశ్ గోపీ తెలిపారు.
Admin
Studio18 News