Thursday, 12 March 2026 04:14:35 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Nagababu : మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. వాళ్ళ కోసం సాయం..

Date : 03 August 2024 03:36 PM Views : 281

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన ప్రధాన కార్యదర్శిగా పార్టీ పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ ఇచ్చిన మాట తప్పదు, అందులోను ఎవరికైనా సహాయం చేస్తానని చెప్తే మర్చిపోకుండా చేస్తారు అని అందరూ అంటారు. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా అది చేసి చూపిస్తారు. మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు తన వంతు ఆర్ధిక సహాయం చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటని నెరవేర్చారు నాగబాబు. తాజాగా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆపరేషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు మాట్లాడిన వీడియోని, తాను డొనేట్ చేసిన డబ్బు ప్రూఫ్ ని షేర్ చేస్తూ.. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకి నా వంతు సాయం చేస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాటకి గాను వారికి నేను 6 లక్షల రూపాయల సహకారం అందించాను. ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు కాని ఇచ్చిన మాట మర్చిపోలేదన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం చాలా అదృష్టంగా ఉందని తెలియజేయడానికి అని పోస్ట్ చేసారు. దీంతో మెగా బ్రదర్ నాగబాబుని మరోసారి అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :