Friday, 18 July 2025 07:22:15 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Demonte Colony 2 : ‘డీమాంటీ కాలనీ 2’ మూవీ రివ్యూ.. ఈ హారర్ సీక్వెల్ భయపెట్టిందా?

Date : 23 August 2024 11:03 AM Views : 1276

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Demonte Colony 2 Movie Review : 2015 లో రిలీజయిన హారర్ సినిమా డీమాంటీ కాలనీ సినిమా తమిళ్ తెలుగు ప్రేక్షకులని భయపెట్టి మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా డీమాంటీ కాలనీ 2 వచ్చింది. ఆల్రెడీ తమిళ్ లో ఆగస్టు 15న రిలీజయి సూపర్ హిట్ అయిన హారర్ థ్రిల్లర్ సినిమా డీమాంటీ కాలనీ 2 ఇప్పుడు తెలుగులో రిలీజయింది. డీమాంటీ కాలనీ 2 సినిమా నేడు ఆగస్టు 23న తెలుగులో థియేట్రికల్ రిలీజ్ అయింది. అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్.. పలువురు ముఖ్య పాత్రల్లో అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా తెలుగులో ఈ సినిమాని శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో బి.సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి రిలీజ్ చేసారు. కథ విషయానికొస్తే.. కొన్నేళ్ల క్రితం సూసైడ్ చేసుకొని మరణించిన భర్త సామ్(సర్జనో కాలిద్) ఎలా చనిపోయాడో కనుక్కోవాలని డెబీ(ప్రియా భవాని శంకర్) ప్రయత్నిస్తుండగా అతని ఆత్మతో మాట్లాడే ప్రయత్నంలో ఒక లైబ్రరీలో ఒక పుస్తకం చదవడం వల్లే అతను మరణించాడని తెలుస్తుంది. అంతేకాకుండా ఆ పుస్తకం ఆరేళ్లకొకసారి కొంతమందిని చంపుతుందని తెలుస్తుంది. అప్పుడు కూడా శ్రీనివాస్(అరుళ్ నిధి), రఘునందన్(అరుళ్ నిధి) కవలలు ఆ పుస్తకాన్ని చదివి మరణించబోతున్నారని డెబీకి తెలుస్తుంది. దీంతో వాళ్ళని కాపాడటానికి రిచర్డ్(అరుణ్ పాండియన్)తో కలిసి డెబీ ప్రయత్నిస్తుంది. అదే సమయంలోకి డీమాంటీ కాలనీలోకి వేరే అమ్మాయిలు ఎలా వచ్చారు? టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు వీరిని కాపాడగలిగారా? డెబీ ఆ ఇద్దర్ని కాపాడిందా? డీమాంటీ కాలనీ వీళ్ళను ఎంతవరకు భయపెట్టింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ.. డీమాంటీ కాలనీ మొదటి భాగాన్ని చూసిన వాళ్ళకి ఈ సినిమా బాగా అర్ధమవుతుంది. ఫస్ట్ పార్ట్ చూడకుండా పార్ట్ 2కి వెళ్తే కాస్త కన్ఫ్యూజ్ అయినా మెల్లిగా కథలోకి వెళ్తారు. సాధారణంగా హారర్ సినిమాల్లో చాలా వరకు ఆత్మలతోనే పోరాటం ఉంటుంది. ఇందులో కూడా అంతే. ఫస్ట్ పార్ట్ భర్త ఆత్మహత్య, భార్య ఆ ఆత్మతో మాట్లాడటం, డీమాంటీ కాలనీ గురించి తెలియడం అంటూ ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కి అందరూ డీమాంటీ కాలనీకి రావడం, అక్కడ జరిగే సంఘటనలు ప్రేక్షకులని భయపెడతాయి. అంతేకాకుండా సినిమాలో ట్విస్టులు కూడా ఇచ్చి సర్ ప్రైజ్ చేసారు. హారర్ అనుభవం ప్రేక్షకులకు ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల పూర్తిస్థాయి హారర్ సినిమాలు సరిగ్గా రావట్లేదు. అలాంటి లోటుని ఈ డీమాంటీ కాలనీ 2 కచ్చితంగా తీరుస్తుంది. మొదటిసారి ఇండియన్ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీని చాలా బాగా చూపించారు. హారర్ తో పాటు సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది. థియేటర్ లో హారర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా చూడాలంటే డీమాంటీ కాలనీ 2కి వెళ్లాల్సిందే. చివర్లో పార్ట్ 3కి లీడ్ ఇవ్వడం గమనార్హం. నటీనటుల పర్ఫార్మెన్స్.. అరుళ్ నిధి కవలలుగా రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ బాగా నటించాడు. ప్రియా భవాని శంకర్ మరోసారి తన నటనతో మెప్పించింది. అరుణ్ పాండియన్ కూడా మెప్పిస్తాడు. ముఖ్యంగా బౌద్ధ గురువు, బౌద్ధ భిక్షవులు బాగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు. సాంకేతిక అంశాలు.. హారర్ సినిమాలకు సినిమాటోగ్రఫీ చాలా ముఖ్యం. డీమాంటీ కాలనీ 2లో ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ డార్క్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగున్నాయి. ఇక హారర్ అనుభవం రావాలంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే భయపెట్టాలి. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లో ప్రేక్షకుడిని ఫుల్ గానే భయపెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇంకొంచెం శ్రద్ద పెట్టాల్సింది. కథ పరంగా పాతదే అనిపించినా కొత్త కథనంతో హారర్ థ్రిల్లర్ గా మెప్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని దర్శకుడే నిర్మించడంతో నిర్మాణ పరంగా కూడా ఎక్కడ ఎంత ఖర్చుపెట్టాలో అంతే ఖర్చుపెట్టారు. మొత్తంగా ‘డీమాంటీ కాలనీ 2’ సినిమా ఫస్ట్ పార్ట్ ని మించి ప్రేక్షకులని భయపెట్టడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :